నల్ల పోచమ్మ బోనాలు | - | Sakshi
Sakshi News home page

నల్ల పోచమ్మ బోనాలు

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

ఖానాపూర్‌: పట్టణంలోని సుర్జాపూర్‌, మస్కాపూర్‌ గ్రామాల్లో నల్లపోచమ్మ ఆలయ ఐదో వార్షికోత్సవం పురస్కరించుకొని గురువారం బోనాల జాతర నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకొని డప్పుచప్పుళ్ల నడుమ ఊరేగింపుగా ఆలయాలకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేశారు. పోతరాజుల విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి.

‘శుద్ధ జలమణి’ ప్రారంభం

తానూరు: విద్యార్థులకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో దివ్యాంగ్‌ శక్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలోని భోసి శిశుమందిర్‌ పాఠశాలలో గురువారం శుద్ధ జలమణి పథకాన్ని ఫౌండేషన్‌ చైర్మన్‌ మహేశ్‌ ప్రారంభించారు. అనంతరం పాఠశాల సిబ్బంది, పోషకులు ఫౌండేషన్‌ చైర్మన్‌ను సన్మానించారు. దిగంబర్‌, పాఠశాల అధ్యక్షులు శ్రీనివాస్‌, నాయకులు బాలాజీ, రాములు, రాజన్న, నర్సింలు, హెచ్‌ఎం దత్తాత్రి, ఉపాధ్యాయులు ఉన్నారు.

అభ్యసన సామర్థ్యాలు పెంచాలి

ఖానాపూర్‌: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యాశాఖ ఖానాపూర్‌ సెక్టార్‌ అధికారి రాజేశ్‌నాయక్‌ అన్నారు. గురువారం ఖానాపూర్‌లోని శాంతినగర్‌ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. మధ్యాహ్న భోజనం, పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వహీద్‌ఖాన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement