భైంసాటౌన్: పట్టణంలో భైంసా–నిర్మల్ మార్గంలో జాతీయ రహదారిపై బీటీ ఓవర్‌లే పనులు జరుగుతున్నాయి. సాత్‌పూల్ వంతెనపై చేపడుతున్న మరమ్మతులతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రద్దీ ఎక్కువ ఉండే వేళల్లో పనులు చేపడుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. అసలే ఇరుకు వంతెన కావడంతో ఓ వైపు పనులు జరుగుతున్నాయి. దీంతో ఒక వైపు నుంచే వాహనాలు అనుమతిస్తుండడంతో వంతెనకు ఇరువైపులా పదుల సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రజలకు ఇబ్బంది కల్గకుండా రద్దీ లేని రాత్రివేళల్లో పనులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.


