తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చర్యలు

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

మామడ: ఎల్‌నినో నేపథ్యంలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ విజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. నీటి ఇబ్బందులున్న ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి హరికృష్ణ, మిషన్‌ భగీరథ గ్రిడ్‌ సాయి సంప్రీత్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ క్రాంతికుమార్‌, ఈజీఎస్‌ ఏపీవో శివాజీ ఉన్నారు.

చదువుతోనే ఉన్నత స్థానాలు

తానూరు: చదువుతోనే ఉన్నత స్థానాలకు చేరుకుంటామని.. విద్యార్థులు ప ట్టుదల, ప్రణాళికతో బాగా చదువుకోవాలని మోటివేషనల్‌ స్పీకర్‌ వాడేకర్‌ లక్ష్మ ణ్‌ పేర్కొన్నారు. గురువా రం మండలకేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వం లక్షణాలు, సానుకూల ఆలోచన విధానం, పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధత అంశాలపై అవగాహన కల్పించారు. రోజుకు 5 నిమిషాలు ధ్యానం అలవాటు చేసుకోవడంతోపాటు వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పదోతరగతి విద్యార్థులకు సూచించారు. హెచ్‌ఎం సాయిబాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement