నిర్మల్ రూరల్: మండలంలోని తల్వేద గ్రామంలో నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయాన్ని హైదరాబా ద్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్‌గా ఆదివారం ప్రారంభించారు. ప్రత్యక్షంగా జిల్లా అధ్యక్షుడు రితీశ్‌రాథోడ్ ప్రారంభించి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణగౌడ్, నారాయణరెడ్డి, సీనియర్ నాయకు లు అయ్యన్నగారి భూమయ్య, రావుల రామనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, నల్ల రవీందర్‌రెడ్డి, కరిపే విలాస్, ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, జిల్లా ఇన్‌చార్జి గోపిడి స్రవంతిరెడ్డి, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు దత్తాద్రి, అంకం మౌనిక, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.


