ప్రభుత్వం సూచించిన 7 రకాలు
సాంబా మసూరి (బీపీటీ 5204)
తెలంగాణసోనా (ఆర్‌ఎన్‌ఆర్ 15048)
కూనారం వరి (కేఎన్‌ఎం 1638)
జై శ్రీరామ్
హెచ్‌ఎంటీ (సోనా)
సిద్ధి (డబ్ల్యూజీఎల్ 44 )
కేఎన్‌ఎం 7715
లక్ష్మణచాంద: తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పే పాలకులు ఆచరణలో మాత్రం వెనుకబడుతున్నా రు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు పంటల సా గు విషయంలో నిబంధనలు విధించడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే మొదలైంది. జూన్ మొదటి వారంలోనే జిల్లా రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. వర్షాలు కురిసిన వెంటనే విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. నీటి వసతి ఉన్న రైతులు వరి నార్లు పోసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కువకపోవడంతో మిగతా రైతులు విత్తనాలు వేసేందుకు వెనుకాడుతున్నారు. ఈ సమయంలో సన్న వ రి సాగు విషయంలో ప్రభుత్వం ఈసారి కఠిన నిబంధనలు విధించింది. తాము సూచించిన 7 రకాల సన్న వడ్లు మాత్రమే సాగు చేయాలని, ఆ రకాలకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఇతర రకాల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
అవగాహన కల్పించడంలో విఫలం..
వానాకాలం సీజన్‌కు సూచించిన ఈ ఎనిమిది రకాలపై రైతులకు సకాలంలో అవగాహన కల్పించడంలో వ్యవసాయాధికారులు విఫలమయ్యారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి, నారు పోసిన తర్వాత ఇవే రకాలు సాగు చేయాలి అని చెప్పడం సరైనది కాదని రైతులు ప్రశ్నిస్తున్నారు. సూచించిన రకాల విత్తనాలు కూడా జిల్లాలో అందుబాటులో ఉంచలేదని మరికొందరు పేర్కొంటున్నారు.
యూరియా యాప్‌పైనా..
ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్(యూరియా కోసం)పై సగం కంటే ఎక్కువ మంది రైతుల కు అవగాహన లేదు. ఎక్కువ మంది రైతులు నిరక్షరాస్యులు కావడం, వ్యవసాయాధికారులు అవగా హన కల్పించడంలో అలసత్వంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాదనలు వినిపిస్తున్నాయి.


