కాంగ్రెస్‌ ఓట్లు తొలగించే కుట్ర | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఓట్లు తొలగించే కుట్ర

Jun 29 2026 2:05 AM | Updated on Jun 29 2026 2:05 AM

● జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

– వివరాలు 9లోu

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్న మైనార్టీ, ఎస్టీ, ఎస్సీల ఓట్లు తొలగించే కుట్ర చేసిందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. పట్టణంలోని దివ్య గార్డెన్‌లో ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ బీఎల్‌ఏలకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఎల్‌ఎలు, పార్టీ మండల అధ్యక్షులు, సూపర్‌ వైజర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావాలన్నా, రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలన్నా ఈ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నెల రోజులపాటు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, బూత్‌ లెవల్‌ ఏజెంట్స్‌ అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా చూడాలని కోరారు. ఓట్ల తొలగింపుతో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

నియోజకవర్గ సమస్యలపై సమీక్ష..

నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తామన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించడానికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. సమష్టిగా కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి పని చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణరావు పటేల్‌, గ్రంథాలయ చైర్మన్‌ అర్జుమంద్‌ అలీ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, నియోజకవర్గంలోని బీఎల్‌ఎలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

భారమైనా సంక్షేమం ఆపం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement