భైంసారూరల్: మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. ఇంటింటి సర్వే నిర్వహణ, ఓటరు వివరాల నమోదు, అర్హుల జాబితా తయారీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతీ ఓటరును జాబితాలో చేర్చడంతోపాటు, అనర్హుల పేర్ల తొలగింపులో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. సర్వేలో నిర్లక్ష్యానికి తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎల్‌పీవో లక్ష్మణ్, ఎంపీవో ప్రదీప్, బీఎల్‌వోలు ఉన్నారు.


