● డీఐఈవో పరశురాం
సారంగపూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచేలా అధ్యాపకులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా మధ్యామిక విద్యాధికారి(డీఐఈవో)పరశురాం అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఇప్పటి వరకు కళాశాలలో చేరిన విద్యార్థుల వివరాలు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్ధుల వివరాలను ప్రిన్సిపాల్ శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈయేడాది ప్రైవేటుకు దీటుగా పిల్లలకు విద్యాబోధన చేసేలా లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. గతేడాదికన్నా మెరుగైన ఫలితాల సాధనకు విద్యాబోధన తీరును మరింత మెరుగుపరచాలన్నారు. ప్రైవేటు కళాశాలలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి ఇక్కడున్న ప్రభుత్వ కళాశాల సదుపాయాలు, విద్యాభోదన తీరును వివరిస్తూ ప్రభుత్వ కళాశాలకు రప్పించేలా చూడాలని సూచించారు.


