రాయితీని సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రాయితీని సద్వినియోగం చేసుకోవాలి

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

లక్ష్మణచాంద: రైతులు ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ నిర్మల్‌ డివిజన్‌ అధికారి మౌనిక తెలిపారు. సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామంలో మహిళా రైతు కొండ్ర నర్సవ్వ సాగు చేస్తున్న కూరగాయలను శనివారం ఆమె పరిశీలించారు. అనంతరం రామకృష్ణారెడ్డి బెడ్‌ పద్ధతిని, మల్చింగ్‌ విధానంలో పంటలు సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు పలు సూచనలు చేశారు. కూరగాయల సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.9,600 రాయితీ ఇస్తుందని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు కూరగాయాల సాగుకు డ్రిప్‌, మల్చింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement