నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 28 2026 7:12 AM | Updated on Jun 28 2026 7:12 AM

● బడిపై మమకారం..చదువుకు సహకారం..● ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ వివిధ రూపాల్లో అండ ● ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల చేయూత ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2026 ●

న్యూస్‌రీల్‌

నిర్మల్‌ బస్టాండ్‌ ప్రాంతంలో ఆటోలు, బైక్‌లను అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది. బస్టాండ్‌ ఇన్‌, ఔట్‌ గేట్‌ల వద్ద అడ్డంగా 15 నుంచి 20 ఆటోలను నిలుపుతున్నారు. దీంతో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బస్టాండ్‌లోకి వెళ్లేందుకు వీలు లేకుండా ప్రధాన ద్వారం ఎదుటే ఆటోలు నిలిపి ఉంచడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియంత్రించాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆర్టీసీ గార్డ్స్‌ మచ్చుకై నా కనిపించడం లేదు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌ నిర్మల్‌

7

పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు చేయూతనిస్తున్నారు. ఒకప్పుడు చదువుకున్న బడి అంటే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. బాల్యం జ్ఞాపకాలు, గురువుల బోధనలు, స్నేహితులతో గడిపిన క్షణాలు అన్నీ ప్రభుత్వ పాఠశాలలతో ముడిపడి ఉంటాయి. కాలం మారినా, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లినా తమను తీర్చిదిద్దిన బడిని మరిచిపోని వారు ఎంతోమంది ఉన్నారు. పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, దాతలు, ఉపాధ్యాయులు ముందుకొచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు. అలాగే పలువురు ఉపాధ్యాయులు తమ బడిని కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. – నిర్మల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement