ఖానాపూర్: ఖానాపూర్ పట్టణంలో రూ.16.64 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, ఎంపీ గొడెం నాగేష్‌తో కలిసి శనివారం రాత్రి శంకుస్థాపన చేశా రు. రూ.14 కోట్లతో కడెం మండలం నచ్చన్న ఎల్లాపూర్ రహదారి విస్తరణ, మరమ్మత్తు పనులు, ఖానాపూర్ పట్టణంలో రూ.1.21 కోట్లతో బొడ్డోనికుంట చెరువు పునరుద్ధరణ పనులు, రూ.1.43 కోట్లతో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణం చేయనున్నారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో దేవిదాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ అంక మౌనిక, మున్సిపల్ కమిషనర్ సుందర్‌సింగ్, తహసీల్దార్ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగల భూషణ్, వైస్ చైర్మన్ మాజిద్, ఆత్మ చైర్మన్ గాడ్పు సత్యం, కౌన్సిలర్లు చిన్నం సత్యం, పోలంపల్లి రమేశ్, గుమ్ముల అశోక్, బొప్పారపు సత్యవతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జంగిల్ శంకర్, పట్టణ అధ్యక్షుడు గొర్రె గంగాధర్ పాల్గొన్నారు.
నేడు జిల్లాలో ‘జూపల్లి’ పర్యటన
నిర్మల్‌చైన్‌గేట్: పర్యాటక, సాంస్కృతిక, పురా వస్తు, ఎకై ్సజ్ శాఖ, ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం జిల్లాలో పర్యటించనున్నా రు. ఉదయం బాసర నుంచి భైంసా చేరుకుని భైంసాలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తారు. రూ.2.14 కోట్లతో చేపట్టే మహదేవ్‌పూర్ చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్స్‌లో నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు.


