సారంగపూర్: మాదకద్రవ్యాలను నిరోధించే ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.రవీందర్ అన్నారు. మండలంలోని చించోలి(బి) ఎక్స్‌రోడ్డు సమీపంలోని మహాత్మా జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గంజాయి, కొకై న్, హెరాయిన్‌తో కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఎన్‌డీపీఎస్ చట్టం గురించి తెలియజేశారు. మైనర్లకు వాహనాల అప్పగించడంతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులే బాధ్యులవుతారన్నారు. అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ విజ్‌కుమార్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


