తానూరు మండల కేంద్రంలోని కేజీబీవీలో అడ్మిషన్లు పూర్తయ్యాయి. దీంతో సిబ్బంది పాఠశాల గేటుకు ‘అడ్మిషన్స్ క్లోజ్’ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలో 6నుంచి 10వ తరగతి వరకు 262 మంది విద్యార్థులున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు ప్రవేశపెట్టారు. ఇందులో 25మంది విద్యార్థినులు ప్రవేశం పొందారు. దీంతో విద్యార్థినుల సంఖ్య 287కు చేరింది. ఇంతకంటే ఎక్కువగా అడ్మిషన్లు తీసుకుంటే సౌకర్యాలు సరిపోవనే కారణంతోనే ప్రవేశాలు లేవని బోర్డు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ అలేఖ్య తెలిపారు. – తానూరు


