నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

● దారులు లేవు, వెలుగులు రావు ● వైద్యం, విద్యకు నోచుకోవు ● ఇదీ జిల్లాలో అటవీ గ్రామాల దుస్థితి శనివారం శ్రీ 27 శ్రీ జూన్‌ శ్రీ 2026 ● ఎస్పీ జానకీషర్మిల

న్యూస్‌రీల్‌

అక్షర శ్రీకారం

ఇటీవల పర్యటించిన ఎమ్మెల్యే, కలెక్టర్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థల్లో కదలిక రోడ్లతోపాటు వివిధ పనులకు నిధులు

7

బుల్లెట్‌ బండెక్కి ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌, కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా సరదాగా షికారుకు వెళ్లలేదు. కనీసం కారు కూడా వెళ్లడానికి ‘దారి’లేని ఊళ్ల దుస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు బయలుదేరారు. ఈనెల 11న వీరిద్దరు బైక్‌పై పెంబి, కడెం మండలాల్లోని అటవీ గ్రామాల్లో పర్యటించారు. మౌలిక సౌకర్యాలతోపాటు కనీసం కమ్యూనికేషన్‌ వ్యవస్థలూ లేవన్న విషయాన్ని గ్రహించారు. వాటి పరిష్కారానికి అక్కడి నుంచే చర్యలు మొదలుపెట్టారు. గుమ్మెన ఎంగ్లాపూర్‌లో సెల్‌టవర్‌, పెంబి మండలంలో రూ.2.43 కోట్లతో రోడ్లు, డ్రెయిన్లు, వివిధ పనులను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇలా.. ఎమ్మెల్యే, కలెక్టర్‌, పెద్దసార్లంతా తమ గూడేలకు రావడం, సమస్యలు తెలుసుకోవడంతోపాటు పరిష్కార చర్యలనూ ప్రారంభించడంతో గిరిజనులు తమ దశ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతీ ఫిర్యాదుపై సత్వరం స్పందించాలి

లక్ష్మణచాంద: ఠాణాకు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై చట్టప్రకారం సత్వరం స్పందించాలని ఎస్పీ జానకీషర్మిల పోలీసులకు సూచించారు. లక్ష్మణచాంద పోలీస్‌ స్టేషన్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు, పెండింగ్‌ కేసులు, బెయిల్‌ కేసుల నిర్వహణ, రిసెప్షన్‌, మాల్ఖానా, ఆయుధాగారం, సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, పోలీస్‌ స్టేషన్‌ పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్‌ స్టేషన్‌ భవనాన్ని పరిశీలించారు. అంతకుముందు పోలీసులతో సమావేశమై విధి నిర్వహణ, పని తీరుపై మాట్లాడారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌, సోన్‌ సీఐ గోవర్ధన్‌రెడ్డి, లక్ష్మణచాంద ఎస్సై శ్రావణి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్‌: ఓవైపు రాష్ట్రం ‘ఫ్యూచర్‌సిటీ’ల వైపు అభివృద్ధిబాటలో పరుగులు పెడుతుంటే.. అడవుల మధ్య ఉన్న ఆ ఊళ్లు ఇప్పటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటినా అటవీ గ్రామాల ప్రజల జీవన పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్‌, రవాణా, చివరకు కమ్యూనికేషన్‌ వ్యవస్థల వంటి మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. అడవిబిడ్డల కష్టాలపై దృష్టిపెట్టామని, క్రమంగా అన్నీ పరిష్కరిస్తామని పాలకులు, అధికారులు చెబుతున్నారు.

రోడ్లే పెద్ద సమస్య..

ఏ ఊరు అభివృద్ధి చెందాలన్నా కనీసం ఆ ఊరికి మంచి రోడ్డు ఉండాలి. కానీ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అనేక గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారులు లేవు. ఏదైన కష్టం వచ్చినప్పుడు రాళ్లురప్పలు, ఎగుడుదిగుడు అటవీమార్గాల్లో రావడం ఇబ్బంది గా మారుతోంది. అలా.. మధ్యలోనే ఎంతోమంది ప్రాణాలూ పోయాయి. ఎంతోమంది తల్లులు నడి అడవిలోనే బిడ్డలకు జన్మనిచ్చిన రోజులున్నాయి. వర్షాకాలం మరింత కష్టమవుతోంది. రోడ్లు లేక వి ద్య, వైద్యం అందనిద్రాక్షగానే మారాయి. అంబు లెన్స్‌లు రాలేక అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రికి తరలించడం పెద్ద సవాల్‌గా మారుతోంది. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలామంది విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు.

రోడ్డు, కరెంటు లేవు..

ఇప్పటికీ మా ఊరికి రోడ్డు, కరెంటు లేవు. ఎటు వెళ్లాలన్నా కాలినడకనే. ఎన్నోసార్లు మా సమస్యను చెప్పినం. ఇప్పటికై నా రోడ్డు, కరెంటు వంటి కనీస సౌకర్యాలను మా అటవీ గ్రామాలకు కల్పించాలి.

– ఆత్రం మాణిక్‌రావు, మిద్దెచింత, మం.కడెం

కేజీబీవీలకు యూనిఫాం

‘డబుల్‌’ గృహ ప్రవేశాలు

బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 1,376 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల కానుకలు, అర్చనలు, ఇతర సేవల ద్వారా ఒక్కరోజే రూ.12,03,260 ఆదాయం సమకూరినట్లు ఈవో అంజనాదేవి తెలిపారు.

చిగురిస్తున్న ఆశలు..

కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌ ఉన్నప్పుడూ పెంబి మండల వాసులు కాలినడకన కలెక్టరేట్‌కు వచ్చి తమ గోడు వినిపించారు. వారంలో సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ అలాగే ఉండిపోయింది. కలెక్టర్‌ మారడంతో ప్రస్తుతం వచ్చిన భవేశ్‌మిశ్రా స్థానిక ఎమ్మెల్యే బొజ్జుపటేల్‌తో కలిసి ఆయా గ్రా మాలను స్వయంగా పరిశీలించారు. కమ్యూనికేషన్‌ కోసం ముందుగా టవర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. వాగులపై వంతెనలు కట్టిస్తామన్నారు. దీంతో ఆ అటవీగ్రామాల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికై నా మా జీవితాల్లో ‘వెలుగులు’ వస్తాయని ఆశిస్తున్నారు.

ఫిర్యాదులు పరిష్కరించాలి

నిర్మల్‌టౌన్‌: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పోలీస్‌ అధికారులను ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్‌ అధికారులతో గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారానికి తీసుకున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై శుక్రవారం సమీక్ష చేశారు. ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను ప్రత్యేకంగా సమీక్షించి విచారణ వేగవంతం చేయాలని సూచించారు. ప్రతీ పిటిషన్‌పై ఎప్పటికప్పుడు ఫాలోఅప్‌ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

దశ మారుస్తారా..!

నడుసుకుంటపోయి చెప్పినం...

ఇప్పటిదాకా కనీసం కరెంటు, రోడ్డు కూడా లేని మాకష్టాలను తీర్చాలంటూ ఇక్కడి నుంచి నిర్మల్‌ దాకా నడుసుకుంటూ పోయి మా గోస చెప్పినం. పాలకులు, అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలి.

– కనక నిర్మల, చాక్‌రేవు, మం.పెంబి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement