● ఏళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపు ● సొంతింటి కల నెరవేరుతున్న వేళ.. ● రేపు మంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవం | - | Sakshi
Sakshi News home page

● ఏళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపు ● సొంతింటి కల నెరవేరుతున్న వేళ.. ● రేపు మంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవం

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

● ఏళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపు ● సొంతింటి కల నెరవేరుతున్న వేళ.. ● రేపు మంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవం

మహదేవ్‌ చెరువు సుందరీకరణ..

పట్టణంలోని సిద్దార్థనగర్‌లోని మహాదేవ్‌ చెరువు కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురవుతోంది. చెరువు సుందరీకరణకు నోచుకోకవడంతో క్రమేపీ కుచించుకుపోతోంది. అమృత్‌ 2.0 కింద రూ.2.14 కోట్లతో చెరువు సుందరీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ సైతం పూర్తయింది. మంత్రి జూపల్లి చేతులమీదుగా ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. సుందరీకరణలో భాగంగా చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, స్టోన్‌ పిచింగ్‌, పిచ్చి మొక్కల తొలగింపు, చిన్నపాటి పార్కు నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పట్టణ ప్రజలకు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ కోసం ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి రానుంది.

భైంసాటౌన్‌: పట్టణంలోని పార్డి(బి) బైపాస్‌ మార్గంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు మోక్షం కలగనుంది. ఇళ్ల నిర్మాణం పూర్తయి దాదాపు మూడేళ్లు కావస్తున్నా లబ్ధిదారులకు కేటా యించలేదు. దీంతో అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నామంటూ లబ్ధిదారులు పలుమార్లు ఆందోళన చే పట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తి రిగారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. మౌలిక వసతు ల కల్పనలో జాప్యం కారణంగా ఇళ్ల పంపిణీ చేపట్ట లేదని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ప నులు పూర్తికాగా, పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా సోమవారం ఇళ్ల పంపిణీ చేపట్టనున్నారు.

మూడేళ్లకుపైగా నిరీక్షణ..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పట్టణ పరిధిలోని పేదల కోసం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేసింది. మొదటి విడతలో 160, రెండో విడతలో 441 ఇళ్లు మంజూరు కాగా, 2023లో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే అర్హుల ఎంపిక ప్రక్రియ, మౌలిక వసతుల కల్పనలో జాప్యం కారణంగా ఇళ్ల కేటాయింపు జరగలేదు. ఇళ్ల నిర్మాణం పూర్తయినా తమకు కేటాయించకపోవడంతో పలుమార్లు లబ్ధిదారులు నిరసన చేపట్టారు. కొందరైతే తాళాలు పగులగొట్టి తాత్కాలికంగా నివాసముంటున్నారు. రెండు నెలల కిందట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీటిపై సమీక్ష జరిపారు. అసంపూర్తిగా ఉన్న విద్యుత్‌, తాగునీరు, డ్రైనేజీ, రోడ్డు పనులు పూర్తి చేయించి, అర్హులైన వారికి వెంటనే ఇళ్లను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేశారు. ఎట్టకేలకు పనులు పూర్తికాగా, ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement