భక్తిశ్రద్ధలతో మొహర్రం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో మొహర్రం

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

పార్‌పల్లిలో అసైదూలా ఆడుతున్న యువకులు

మునిపల్లిలో పీరీలను దర్శించుకుంటున్న భక్తులు

పంజేషా గల్లీలో పీరీల ఊరేగింపు

మత సామరస్యానికి ప్రతీక అయిన మొహర్రంను జిల్లావాసులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణాలు, పల్లెల్లో సవారీలను ఊరేగించారు. రెండో రుయ్యాడిగా ప్రసిద్ధి చెందిన మునిపల్లిలో ఉదయం గోదావరి జలాలను ఊరేగింపుగా తెచ్చి పీరీలకు అభిషేకం చేశారు. అనంతరం మలిదలు సమర్పించారు. అగ్నిగుండాల చుట్టూ భక్తులు అసైదులా ఆడారు. అగ్నిగుండం దాటే కార్యక్రమాల నిర్వహించారు. మునిపల్లిలో వేడుకలు తిలకిచేందుకు జిల్లా నలు మూలల నుంచి భక్తులు తరలివచ్చారు. పీరీలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. – లక్ష్మణచాంద/సాక్షి ఫొటోగ్రాఫర్‌, నిర్మల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement