నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 26 2026 7:15 AM | Updated on Jun 26 2026 7:15 AM

శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

విడుదలవుతున్న ఉద్యోగ నోటిఫికేషన్లు ఉచిత కోచింగ్‌ లేక అభ్యర్థులు ఆందోళన ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు డిమాండ్‌

‘బాసర’కు భద్రత కావాలి

బాసర శ్రీజ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుస చోరీలు భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టాయి.

నిర్మల్‌ఖిల్లా: ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగం పుంజుకోవడంతో జిల్లా నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయి. డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్లు, డైట్‌ లెక్చరర్ల నియామకాల నోటిఫికేషన్లు వెలువడ్డాయి. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక కేంద్రం బ్యాంకింగ్‌, రైల్వే, ఎస్సెస్సీ వంటి విభాగాల్లో ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయి. పోటీ పరీక్షల సన్నాహాలు వేగవంతమవుతున్నాయి.

స్టడీ సర్కిల్స్‌ లేక..

చదువులతల్లి జ్ఞాన సరస్వతీదేవి కొలువైన జిల్లా నిర్మల్‌. మొత్తం జనాభాలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ. మెజారిటీ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుదీర్ఘంగా నస్నద్ధం అవుతున్నారు. అయితే కోచింగ్‌ కోసం హైదరాబాద్‌, వరంగల్‌ వెళ్లే స్థోమత లేని వారు ఇబ్బంది పడుతున్నారు. ఉచిత శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా నిరుద్యోగులు దశాబ్దకాలంగా కోరుతున్నారు. ఇప్పటికీ దీనిపై స్పష్టత లేదు.

ప్రైవేట్‌ కోచింగ్‌ భారం

ప్రైవేట్‌ కోచింగ్‌ సెటర్లు ఒక్కో జాబ్‌ కోచింగ్‌కు రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. వసతి, భోజనం, ప్రయాణ ఖర్చులతో కలిపి లక్ష రూపాయలకుపైగా ఖర్చవుతోంది. రైతు, కూలీ, చిరు వ్యాపారుల కుటుంబాల యువతకు ఈ ఖర్చు భారంగా మారుతోంది. ఫలితంగా ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ లేక పోటీ పరీక్షల్లో వెనుకబడుతున్నారు.

గ్రంథాలయాల్లో సౌకర్యాల కొరత

జిల్లా కేంద్రం, మండలాల్లో ప్రభుత్వ గ్రంథాలయాలు ఉన్నప్పటికీ పోటీ పరీక్షలకు అవసరమైన సదుపాయాలు లేవు. స్టడీ మెటీరియల్‌ కూడా చాలా గ్రంథాలయాల్లో అందుబాటులో లేదు. సీటింగ్‌ సామర్థ్యం పరిమితంగా ఉంది. తాజా పుస్తకాలు తక్కువ, డిజిటల్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు చదవడానికి సమయం పొడిగించలేదు.

ప్రజాప్రతినిధులు చొరవ చూపితే..

జిల్లాలో బీసీ,ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చొరవ చూపాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పోటీ పరీక్షల్లో గ్రామీ ణ యువత సత్తా చాటేందుకు, పేద విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు స్టడీ సర్కిల్‌ ఏర్పాటు అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.

నిరుద్యోగులు

26 వేలు(సుమారు)

రెవెన్యూ గ్రామాలు 400

తక్షణమే ఏర్పాటు చేయాలి...

విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు తక్షణమే జిల్లాలో ఏర్పాటు చేయాలి. స్థానిక డిమాండ్‌ మేరకు స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేస్తే అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది. పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం తరఫున కూడా ఇదే అంశంపై సాధనదిశగా పోరాటం చేస్తాం. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని స్టడీ సర్కిల్‌ ఏర్పాటయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.

– సింగరి వెంకటేశ్‌, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు

స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి..

జిల్లాలోని నిరుద్యోగులకు స్టడీ సర్కిల్‌ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి సుదూరప్రాంతాలకు వెళ్తున్నారు. నిరుపేద నిరుద్యోగులకు కోచింగ్‌ భారంగా మారుతోంది. ఉద్యోగాల సాధనలో వెనుకబడుతున్నారు. జిల్లా జనాభాలో 70 శాతం బీసీ జనాభా ఉంది. బీసీ స్టడీ సర్కిల్‌ లేకపోవడంతో బీసీ యువత నష్టపోతోంది. ప్రజాప్రతినిధులు బీసీ స్టడీ సర్కిల్‌తోపాటు, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలి.

– ఎంబడి చంద్రశేఖర్‌, బీసీ సంక్షేమసంఘం జిల్లా అధ్యక్షుడు

‘వెండింగ్‌జోన్లు’ అవసరం..

పట్టణాల్లో చిరు వ్యాపారులనూ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. వారికంటూ ప్రత్యేకంగా విక్రయ ప్రాంతాలను స్థానిక సంస్థలు చూపాల్సి ఉంటుంది. జిల్లాలో అలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఉపాధి కోసం వారంతా రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారి జీవనోపాధి కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు పాదచారులకు ప్రాణసంకటంగా మారుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా స్థానిక సంస్థలు ప్రత్యేక వెండింగ్‌జోన్లను ఏర్పాటు చేయాలి.

విధులు సమర్థవంతగా నిర్వహించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌:కలెక్టరేట్‌లో అన్నివిభాగాల అధి కారులు విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ఆదేశించా రు. కలెక్టరేట్‌ సమావేశమందిరంలో వివిధ శాఖ ల సూపరింటెండెంట్లు, అధికారులతో గురువా రం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సంబంధించిన ప్రతీ సమస్యను అత్యంత ప్రాధాన్యమైనది గా పరిగణించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.ప్రజావాణిలో స్వీకరించే ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిష్కారా నికి చర్యలు తీసుకోవాలన్నారు. భూ భారతి కింద స్వీకరించిన దరఖాస్తులు 60 రోజు ల్లో పరిష్కరించాలన్నారు. ప్రతీ విభాగానికి సంబంధించిన రికార్డులను క్రమం తప్పకుండా పరి శీలించి, సక్రమంగా భద్రపరచాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని హెచ్చరించారు. ప్రతీ విభాగం పరిధిలో ని ఉద్యోగుల వివరాలు, పెండింగ్‌ అంశాలపై సమగ్ర సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలన్నా రు. అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, అధికారులు పాల్గొన్నారు.

మండలాలు 19

ప్రత్యేక శిక్షణ అవసరం..

నేటి పోటీ పరీక్షల్లో పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోదు. సిలబస్‌పై లోతైన అవగాహన, రోజువారీ కరెంట్‌ అఫైర్స్‌, ఆన్‌లైన్‌ పరీక్షలు, మాక్‌ టెస్టులు, నెగెటివ్‌ మార్కింగ్‌, సమయ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అవసరం. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ అందిస్తే గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి ఉద్యోగ నోటిఫికేషన్లకు అనుగుణంగా బ్యాచ్‌ల వారీగా కోచింగ్‌ ఇప్పించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. నాణ్యమైన అధ్యయన సామగ్రి, డిజిటల్‌ లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని, ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిపుణులతో ఉచిత కెరీర్‌ గైడెన్స్‌, ఇంటర్వ్యూ శిక్షణ, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.

నిర్మల్‌ జిల్లా

వివరాలు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement