‘డబుల్‌’ ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి

Jun 26 2026 7:15 AM | Updated on Jun 26 2026 7:15 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

భైంసాటౌన్‌:పట్టణ శివారులోని పార్డి(బి) బైపాస్‌ మార్గంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌, మున్సి పల్‌ చైర్మన్‌ తూముల దత్తాత్రితో కలిసి డబుల్‌ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని గురువారం పరిశీలించారు. అంతకుముందు మున్సిపల్‌ కార్యాలయంలో సమీక్షించారు. అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలో జిల్లాలో పర్యటించనున్నారని, ఆయన చే తుల మీదుగా ఇళ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు. వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చే యాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతోపాటు ఇతర మౌలిక వసతులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం కుభీర్‌ చౌరస్తా వద్ద డివైడర్‌ను పరిశీలించారు. డివైడర్‌ తొలగింపు, నూతన రోడ్డు నిర్మాణంపై మున్సిపల్‌ చైర్మన్‌ దత్తాత్రి కలెక్టర్‌కు వివరించారు. దీంతో ఆయన నివేదిక పంపించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట సబ్‌ కలెక్టర్‌ సంకేత్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లింగయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ సుభాష్‌, డీఈఈ సునీల్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement