మెనూ ప్రకారం భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెనూ ప్రకారం భోజనం అందించాలి

Jun 26 2026 7:15 AM | Updated on Jun 26 2026 7:15 AM

● ఐటీడీఏ పీవో మకరందు

నిర్మల్‌ రూరల్‌: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఐటీడీఏ పీవో మకరందు సూచించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. రిజిస్టర్లు, కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించారు. వంటగది, భోజనశాల, టాయిలెట్స్‌ ఎలా ఉన్నాయో చూశారు. విద్యార్థుల ఆరోగ్యం శారీరక అభివృద్ధి దృష్ట్యా ఆహారంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో పాఠశాల ఆవరణలో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంటగది ఆవరణలో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేయాలని తెలిపారు. పీవో వెంట డిప్యూటీ డైరెక్టర్‌ అంబాజీ, ప్రధానోపాధ్యాయురాలు అనూష, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement