నిర్మల్‌చైన్‌గేట్:రాష్ట్ర డీజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీవీ.ఆనంద్‌ను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్ర త్యేక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌తోపాటు, అదనపు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన డీజీపీ నిర్మల్ పట్టణ అవసరాలను పరిశీలించి త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌తోపాటు మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని శ్రీహరిరావు తెలిపారు.


