నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

గురువారం శ్రీ 25 శ్రీ జూన్‌ శ్రీ 2026 8లోu ● ఎస్పీ జానకీ షర్మిల ● పెండింగ్‌ కేసుల పురోగతిపై సమీక్ష

న్యూస్‌రీల్‌

నేటి నుంచి జిల్లాలో ప్రక్రియ షురూ స్వయంగా నమోదుకూ అవకాశం ఓటరు జాబితా ప్రక్షాళనకు శ్రీకారం జిల్లాలో 7.53 లక్షల మంది ఓటర్లు ఇప్పటికీ 80.70శాతమే మ్యాపింగ్‌

బాసరకు పోటెత్తిన భక్తులు

బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.

నిందితులపై తక్షణ

చర్యలు తీసుకోవాలి

నిర్మల్‌టౌన్‌: నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. బుధవారం జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలోని పెండింగ్‌ కేసుల పురోగతిపై జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేసి, అవసరమైన ఆధారాలు సేకరించి త్వరగా విచారణ పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్‌ కేసులను ప్రాధాన్యత క్రమంగా పరిష్కరించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దర్యాప్తు ప్రక్రియలో జాప్యం జరగకుండా ప్రతీ కేసు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)ను పక్కాగా చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. పెరిగిన వలసల నేపథ్యంలో ఒకటికి మించి ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లను తొలగించాలని భా విస్తోంది. ఇదే లక్ష్యంతో ఓటరు జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భా గంగా ఇప్పటికే 2002నాటి, ప్రస్తుత ఓటర్ల జాబి తాల ఆధారంగా మ్యాపింగ్‌ ప్రక్రియ చేపట్టింది. ఈనెల 25నుంచి సర్‌ను క్షేత్రస్థాయిలో ప్రారంభించనుంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరు నుంచి వివరాలు సేకరించనున్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేసి సంతకాలతో తిరిగి స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియతో ఇప్పటివరకు గ్రామాలు, పట్టణాల్లో ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే అధికారులు ఒకచోట తొలగించనున్నారు.

తప్పులతడకగా 1,45,819 ఓట్లు

నిర్మల్‌, ఖానాపూర్‌, ముధోల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7,55,344 మంది ఓటర్లున్నారు. ఇందులో 6,09,525 (80.70 శాతం) మంది ఓట ర్ల మ్యాపింగ్‌ ప్రక్రి య పూర్తయింది. ఇంకా, నిర్మల్‌, ముధోల్‌, ఖానా పూర్‌ నియోజకవర్గాల్లో 1,45,819 మంది ఓట్లు తప్పులతడకగా ఉన్నాయి. తాజా ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఈ నెల 25నుంచి ఓటర్ల ఎన్యూమరేషన్‌ నూతన ఫొటో ఓటరు జాబితాలు తయారు చేస్తారు.

ఉద్దేశం ఏమిటంటే?

ఇది ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులందరి భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమం. చనిపోయి న వారు, డూప్లికే ట్‌, శాశ్వతంగా తరలిపోయినవారు, అనర్హుల పేర్లను ఓట రు జాబితా నుంచి తొలగించి, అర్హుల పేర్లు మాత్ర మే చేర్చే ప్రత్యేక కార్యక్రమం. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి పరిశీ లిస్తారు. ఓటర్లు భర్తీ చేసిన ఎన్యూమరేషన్‌ (గణన) ఫారాలను పాత ఓటరు డేటాతో పోల్చి చూస్తారు. 1951నుంచి 2004 మధ్య కాలంలో ఎనిమిది సార్లు ఇలాంటి కసరత్తు చేశారు. జిల్లాలో చివరిసారిగా 2001–2004 మధ్య ఈ ప్రక్రియ కొనసాగింది.

లింక్‌ తప్పనిసరి

ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించేందు కు ఓటరు మొబైల్‌ నంబర్‌ తప్పనిసరిగా ఎపిక్‌ (ఓటరు గుర్తింపు) ఐడీతో లింకై ఉండాలి. ఓటరు ఐడీ, ఆధార్‌కార్డులో ఉన్న వివరాలతో పూర్తిగా సరి పోవాలి. పేరులో స్పెల్లింగ్‌ తేడాలు ఉంటే డిజిటల్‌ ఈ–సైన్స్‌ ప్రక్రియ విఫలమయ్యే అవకాశముంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

షెడ్యూల్‌ ఇలా..

వలసల కారణంగా కొందరికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉండటం, మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం లాంటి సమస్యలున్నాయి. వాటిని సరిచేసేందుకు ఎన్నికల సంఘం సర్‌కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 25నుంచి ‘సర్‌’ ఎన్యూమరేషన్‌ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటరు వివరాలు సరిచూసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అ లాగే, ఓటరు జాబితాలో పేర్లు చేర్చుకోవడం, మా ర్పులు–చేర్పులు చేయించుకోచ్చని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్‌ ఇలా..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement