నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సబ్ జూనియర్ జిల్లా స్థాయి ఆత్యపాత్య క్రీడా ఎంపిక పోటీలు బుధవారం నిర్వహించారు. 100మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు జూలై 10, 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి భూమన్న, సంజీవ్ తెలిపారు. వ్యా యామ ఉపాధ్యాయులు రమణారావు, అన్నపూర్ణగౌడ్, బుచ్చి రామారావు, నచ్చేందర్, కోచ్ సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


