‘సర్‌’ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

పార్టీల ప్రతినిధులతో సమావేశం

నిర్మల్‌చైన్‌గేట్‌: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడతామని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టనున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స మావేశమై మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వివరా లను సమగ్రంగా వివరించారు. ఓటర్లు తమ ఎన్యుమరేషన్‌ ఫారాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వా రా ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకోవచ్చని తెలిపా రు. వివరాల పరిశీలన తర్వాత ఎస్‌ఐఆర్‌కి సంబంధించి జూలై 31వ తేదీన డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్‌ జాబితాను ప్రచురిస్తామని పేర్కొన్నారు. డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్‌లో ఓటరు పేరు లేకపోతే తగిన ఆధారాలతో సంబంధిత ఫారాలు నింపి, ధ్రువీకరణ (డిక్లరేషన్‌)తో ఈఆర్వోలను సంప్రదించాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి ప్రతీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున బీఎల్వోలను నియమించాలని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా, పారదర్శకంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు బీఎల్వోలు, బీఎల్‌ఏలతో సమావేశం నిర్వహించాలని, ఎస్‌ఐఆర్‌ నిర్వహణలో బీఎల్‌ఏలు తమవంతు సహకారం అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌, డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, ఆర్డీవోలు దేవీదాస్‌, మోహన్‌సింగ్‌, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కోతుల పునరావాస కేంద్రం తనిఖీ

సారంగపూర్‌: మండలంలోని చించోలి(బి) గ్రామ సమీపంలోగల కోతుల పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా బుధవారం తనిఖీ చేశారు. ఇప్పటివరకు చేసిన, చేయాల్సిన కు టుంబ నియంత్రణ ఆపరేషన్ల వివరాలు వై ద్యుడు శ్రీకర్‌రాజును అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్లు పూర్తయ్యాక కోతులను ఎక్కడ వదిలిపెడుతున్నారని ఎఫ్‌డీవో నాగినిభానును ప్రశ్నించగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో వదులుతున్నట్లు ఆమె బదులిచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్‌ సుఖ్దేవ్‌ బోబడే, అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబు, డీఆర్వోలు సంతోష్‌, నజీర్‌ఖాన్‌, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement