సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

● ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమీక్ష ప్రత్యేక అధికారి ఇలంబర్తి ● అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమీక్ష ప్రత్యేకాధికారి ఇలంబర్తి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా శాఖల వారీగా చేపట్టిన పనులపై ఏర్పా టు చేసిన ఫొటో గ్యాలరీని కలెక్టర్‌, అధికారులతో కలిసి తిలకించారు. శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాల వివరాలు అధికారులు పవర్‌ పాయింట్‌ ప్ర జెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఇలంబర్తి మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు 99రోజుల ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. పోలీస్‌ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని పేర్కొన్నారు. ముందుగా ఇలంబర్తికి కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అటవీశాఖ వసతిగృహంలో పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.

సమష్టి కృషితోనే విజయవంతం

ప్రజలు, ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యం, అధికారుల కృషితోనే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళి క కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామ, వార్డు సభలు, పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌, అరైవ్‌ అలైవ్‌, రైతు, మహిళా శిశు సంక్షేమం, విద్య, ఆరోగ్య, సాంస్కృతిక, పర్యావరణ వారోత్సవాల పేరిట విస్తృత కార్యక్రమాలు చేపట్టామన్నా రు. గ్రామ, వార్డు సభలు నిర్వహించి అధికారులంతా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంటల దిగుబడి అధికంగా వచ్చిందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేశామని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు పెట్రోల్‌ బంక్‌ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ జానకీ షర్మిల, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, డీఎఫ్వో సుశాంత్‌ సుఖదేవ్‌ బోబడే, భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌కుమార్‌, డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement