గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నిరసన | - | Sakshi
Sakshi News home page

గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నిరసన

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: దేశంలో బీజేపీ సర్కార్‌ చేస్తున్న అక్రమాలను ప్రశ్నించేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఛాత్రోన్‌ కీ గూంజ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ పేర్కొన్నారు. ఛాత్రోన్‌ కీ గూంజ్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలిపారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి మోదీ ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. బొజ్జు పటేల్‌ మాట్లాడు తూ.. దేశంలో విద్యావ్యవస్థ బలోపేతం, యువత భవిష్యత్‌ రక్షణ రాహుల్‌ గాంధీ బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌, అన్ని అనుబంధ సంఘాలు ప్రతీ గ్రామంలో ఛాత్రోన్‌కీ గూంజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించి సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అర్జుమంద్‌ అలీ, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సమరసింహారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement