కోరిన చోటకు బస్సులు | - | Sakshi
Sakshi News home page

కోరిన చోటకు బస్సులు

Jun 25 2026 5:41 AM | Updated on Jun 25 2026 5:41 AM

నిర్మల్‌టౌన్‌: ప్రయాణికులు కోరిన చోటకు ఆర్టీ సీ బస్సులు నడుపుతున్నామని నిర్మల్‌ డిపో మేనేజర్‌ పండరి పేర్కొన్నారు. బుధవారం ని ర్మల్‌ బస్టాండ్‌ నుంచి గోవాకు బస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. నిర్మల్‌ నుంచి బయలుదేరిన బస్సు నాందేడ్‌లోని గురుద్వార్‌, తుల్జాపూర్‌, పండరిపూర్‌, కొల్హాపూర్‌ మీదుగా గోవాకు చేరుకుంటుందని తెలిపారు. ఈ టూర్‌ మొత్తం ఐదురోజులు ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని తె లిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, జూ లై 5న అరుణాచలం, శ్రీరంగం, పలని, మధు రై, రామేశ్వరం, కంచి, శ్రీకాళహస్తికి సూపర్‌ లగ్జరీ బస్సు వెళ్తుందని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement