రైతు అవగాహన కోసమే విత్తన మేళాలు | - | Sakshi
Sakshi News home page

రైతు అవగాహన కోసమే విత్తన మేళాలు

Jun 24 2026 8:22 AM | Updated on Jun 24 2026 8:22 AM

● ఎమ్మెల్యే, వెడ్మబొజ్జుపటేల్‌

● ఎమ్మెల్యే, వెడ్మబొజ్జుపటేల్‌

కడెం: నకిలీ విత్తనాలు కొని మోసపోకుండా రైతుల అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం విత్తనమేళాలు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్‌ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళాకు హాజరై మాట్లాడారు. రైతులు వ్యవసాయాధికారులు సూచించిన మేలురకం విత్తనాలనే ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఖాజామొయినుద్దీన్‌, ఏఎంసీ చైర్మన్‌ భూషణ్‌, ఏడీఏ సుజాత, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, డీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరి సతీశ్‌రెడ్డి, సర్పంచులు దీకొండ విజయ్‌, ఈదుల తిరుపతి, రమేశ్‌, ఆర్టీఏ మెంబర్‌ మల్లేశ్‌, పట్టణ అధ్యక్షుడు వాజీద్‌ఖాన్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌, యూత్‌కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి మల్లేశ్‌యాదవ్‌, ఉద్యానవన క్లస్టర్‌ అధికారి స్పందన, ఏవో దినేశ్‌, ఏఈవోలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement