కుంటాల: ఆదర్శ పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆదర్శ పాఠశాలల రాష్ట్ర డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. సోమవారం స్థానిక ఆదర్శ పాఠశాలను సందర్శించారు. వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్రంలోని అన్ని పాఠశాలను టీపీఎస్ స్కూళ్లుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పేద విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్య అందుతుందన్నారు. పాఠశాలలో హాజరు శాతం పెంచి ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. ఆయన వెంట ఈడబ్ల్యూఐడీసీ పి.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ రవీందర్, నిజామాబాద్ సర్కిల్ డీఈ గంగాధర్‌గౌడ్, ఏఈ మహేశ్‌కుమార్, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు ఉన్నారు.


