నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 23 2026 12:00 AM | Updated on Jun 23 2026 12:00 AM

● వ్యాపారంగా మారిన ప్రైవేటు విద్య ● ఇష్టారాజ్యంగా ఫీజుల పెంపు.. ● పుస్తకాలు, యూనిఫాంలు బడుల్లోనే విక్రయం● తల్లిదండ్రులపై అదనపు భారం మంగళవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

7

సర్‌ పకడ్బందీగా చేపట్టాలి

భైంసాటౌన్‌: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్‌) ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని సబ్‌ కలెక్టర్‌ అజ్మీర సంకేత్‌కుమార్‌ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బీఎల్‌వోలకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 25 నుంచి క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇంటికి వెళ్లి చేపట్టాల్సిన సర్‌ నిర్వహణ, విధి విధానాలు తదితర అంశాలను వివరించారు. ఎన్యుమరేషన్‌ ఫారాల అందజేత, వివరాల నమో దు, తిరిగి స్వీకరణ, ముసాయిదా జాబితా, తుదిజాబితా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శశిభూషణ్‌ పాల్గొన్నారు.

బాసరలో నేడు 2కె రన్‌

బాసర: ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బాసరలో మంగళవారం ఉదయం 6 గంటలకు 2కె రన్‌ నిర్వహించనున్నారు. గోదావరి పుష్కర ఘాట్‌ నుంచి శ్రీజ్ఞా న సరస్వతి అమ్మవారి ఆలయం వరకు ఈ రన్‌ కొనసాగుతుంది. కార్యక్రమానికి కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా హాజరవుతారు. కలెక్టర్‌ వెంట బాసర తహసీల్దార్‌ పవన్‌చంద్ర కోరారు.

భైంసాటౌన్‌: లాభాలు ఆర్జించడానికి విద్య వ్యాపారం కాదని, అది ప్రజల ప్రాథమిక హక్కు అని విద్యాశాఖ నిబంధనలు చెబుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఫీజులు సైతం సామాన్యులకు అందుబాటులో ఉండాలని, వ్యాపార ధోరణి అవలంభించొద్దని పేర్కొంటున్నాయి. అయితే, ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో విద్య వ్యాపారంగా మారింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే పాఠశాలల్లోనే పాఠ్య, నోటు పుస్తకాలు, విద్యార్థులకు యూనిఫాంలు, స్టేషనరీ, షూ, టై, బెల్టులు సైతం విక్రయిస్తున్నాయి. వీటికితోడు బస్‌ చార్జీలు, స్పెషల్‌ ఫీజులు సరేసరి. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన సందర్భాల్లో అధికారులు నామమాత్ర చర్యలతో సరిపెడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలపై పూర్తిస్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో అధిక ఫీజులు, పుస్తకాలు, స్టేషనరీ సైతం అధిక ధరలకు విక్రయంతో పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువు కొనాల్సి వస్తోంది.

పాఠశాలల్లోనే దుకాణాలు

నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. దీంతో జిల్లా కేంద్రం నిర్మల్‌తోపా టు భైంసా, ఖానాపూర్‌, దాదాపు అన్ని మండలకేంద్రాల్లో ప్రైవేట్‌ పాఠశాలలు ఇప్పటికే ‘దుకాణాలు’ ప్రారంభించాయి. విద్యార్థులకు అవసరమైన ప్రతీ వస్తువును ‘స్కూల్‌ స్టాండర్డ్‌’ పేరుతో విక్రయిస్తున్నాయి. బయట మార్కెట్‌లో తక్కువ ధరలకు లభించే వస్తువులు పాఠశాలల్లో అధిక ధరలకు అంటగడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఎన్ని విమర్శలున్నా యాజమాన్యాలు పెడచెవిన పెడుతూ తమ వ్యాపార ధోరణి వీడడం లేదు. కొందరు తాము చెప్పిన దుకాణం నుంచి మాత్రమే బుక్స్‌, యూనిఫాంలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఈ స్థాయిలో విద్యను వ్యాపారం చేయడంపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.

వ్యాపారుల ఉపాధికి గండి..

పాఠశాలల్లో దందాతో కొన్నేళ్లుగా పుస్తకాలు, స్టేషనరీ దుకాణాలతోపాటు యూనిఫాంలు కుట్టే దర్జీలు, విద్యార్థులను స్కూళ్లకు తీసుకెళ్లే ఆటో వాలాలు, షూలు అమ్మే ఫుట్‌వేర్‌ షాపుల యజమానులు ఇలా విద్యార్థులకు సంబంధించి ప్రతీ వస్తువు అమ్మే దుకాణదారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. బుక్‌స్టోర్లు మూతపడినవి ఎన్నో ఉన్నాయి. పాఠశాలలే నేరుగా అమ్మకాలు చేపట్టడంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యాశాఖ చర్యలేవి..?

జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఏటా పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, స్టేషనరీ, యూనిఫాంల విక్రయం చేస్తున్న విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేసిన సందర్భాల్లో మాత్రమే తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల భైంసాలోని పలు ప్రైవేట్‌ పాఠశాలల్లో పుస్తకాలు విక్రయిస్తుండడంతో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పుస్తకాలు ఉన్న గదులను సీజ్‌ చేశారు. జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో తనిఖీలు జరిపి పాఠశాలల్లో ‘దందా’పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement