నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

సోమవారం శ్రీ 22 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

రెండో విడత ప్రక్రియ ప్రారంభం లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు ఇప్పటికే కొనసాగుతున్న సర్వే జాబితాల తయారీలో జాప్యం ఆశగా ఎదరుచూస్తున్న అర్హులు

గుడిసెవాసులకే ఇందిరమ్మ!

సర్కారు బడికే జై..

ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. నాణ్యమైన బోధన అందుబాటులోకి రావడంతో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పిస్తున్నారు.

ప్రొసీడింగ్‌ అందజేత

కుంటాల:మండల కేంద్రంలో సీసీ రోడ్లు, ము రుగు కాలువల నిర్మాణానికి రూ.66లక్షలు మ ంజూరు చేయించిన ఎమ్మెల్యే రామారావు పటే ల్‌ ఆదివారం తన నివాసంలో సర్పంచ్‌ జక్కుల గజేందర్‌కు ప్రొసీడింగ్‌ కాపీ అందజేశారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా సర్పంచ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారుల ఎంపికలో గుడిసెల్లో నివసిస్తున్న వారికి తొ లి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 500 ఇళ్లను గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలకే కేటాయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇప్పటికే గ్రామాలు, ప ట్టణాల్లో గుడిసెలు, ప్లాస్టిక్‌ కవర్ల కింద నివాసముంటున్న నిరుపేదలను అధికారులు గుర్తిస్తున్నారు. గృహ నిర్మాణశాఖ అధికారులు స్వయంగా వెళ్లి అర్హులను గుర్తించి వారితో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆన్‌లై న్‌లో దరఖాస్తు చేయిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వేల ఇళ్ల చొప్పున వంద నియోజకవర్గాలకు రెండు లక్షల గృహాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. మరో 50వేల ఇళ్లు స్టేట్‌ రిజర్వ్‌ కోటాగా నిర్ణయించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2.50 లక్షల గృహాలు మంజూరయ్యాయి.

నియోజకవర్గానికి రెండు వేల చొప్పున

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం రెండు వేల గృహాలను రెండో విడతలో మంజూరు చేసింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన లబ్ధిదా రుల జాబితాలోని అర్హులైన వారిని ఇందిరమ్మ కమి టీల ద్వారా అధికారులు గుర్తిస్తారు. అయితే, ప్రతి పక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ హిస్తున్న నియోజకవర్గాల్లో గుడిసె వాసులకు కేటా యించే 500 ఇళ్లు పోగా, మిగతా 1,500 ఇళ్లలో 40శాతం ఇళ్లను కోటాగా నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ లెక్కన 1,500 గృహాల్లో సుమారు 600 గృహాలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల కోటాగా ఉంటుంది. జిల్లాల్లో ఒక కాంగ్రెస్‌, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట వీరికి 600 ఇళ్ల చొప్పున కేటాయించనున్నారు. ఆయా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లబ్ధిదారుల జాబితాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ జాబితాలోని అర్హులైన వారికే ఇళ్లు కేటాయిస్తారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదాన్ని ఈసారి కూడా తప్పనిసరి చేశారు.

అర్హుల గుర్తింపు పనిలో అధికారులు

రాష్ట్రాన్ని గుడిసెలు లేని తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో గతంలోనే గుడిసె ఇళ్ల వివరాలు సేకరించారు. జిల్లాలో 3,686 గుడిసెలున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వీటిని మరోసారి సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జిల్లాలో 2వేల ఇళ్ల వరకు సర్వే పూర్తి కాగా.. మరో వారం రోజుల్లో మిగతా ప్రక్రియ పూర్తి చేయనున్నారు. గుడిసెల వారితో పాటు మిగతావారి ఎంపిక ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తుండడంతో దరఖాస్తు చేసుకున్న అర్హులు అయోమయానికి గురవుతున్నారు.

మొదటి విడత నిర్మాణాలు ఇలా..

మంజూరైన ఇళ్లు 8,166

గ్రౌండింగ్‌ అయినవి 6,768

మార్కౌట్‌ దశలో.. 1,139

బేస్మెంట్‌ దశలో.. 1,140

గోడల దశలో.. 805

స్లాబ్‌ దశలో.. 1,676

పూర్తయిన ఇళ్లు 2,091

లబ్ధిదారులకు ఇప్పటివరకు

అందజేసిన సొమ్ము రూ.142కోట్లు

రెండో విడతకు ఎదురుచూపులేనా?

ఇందిరమ్మ కమిటీలు ఆయా గ్రామాల్లో అర్హుల జాబితా ఇవ్వగా.. మొదటి విడతలో అందరికీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం దాదాపు ఆరు నెలలుగా రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామంటూ ప్రకటించుకుంటూ వస్తోంది. కాగా, ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలిసిన నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులను కలుస్తూ తమకు రెండో విడతలో ఇల్లు ఇవ్వాలంటూ ప్రాధేయపడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రెండో విడతను కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రారంభించగా.. అన్ని జిల్లాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, జాబితాలు వస్తాయని భావించారు. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రకటనలే గాని ఆదేశాలు రాకపోవడంతో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement