యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

నిర్మల్‌టౌన్‌: ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సెక్రటరీ రాధిక సూచించారు. ఆదివారం అంతర్జాతీ య యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టులో యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగా శారీరక వ్యా యామం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతత, ఏకాగ్రతకు, ఒత్తిడి నియంత్రణకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులున్నారు.

ఎస్పీ క్యాంపు కార్యాలయంలో..

జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల, అధికారులు, సిబ్బంది వివిధ యోగాసనాలు వేశారు.

జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో..

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా శిక్షకులు కార్యక్రమానికి హాజరైన వారితో వివిధ ఆసనాలు వేయించారు. యోగాతో శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని తెలిపా రు. రోజూ కొద్దిసేపు యోగాకు కేటాయిస్తే అనారో గ్య సమస్యలు దరిచేరవని సూచించారు. డీఈవో భోజన్న, డీవైఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, నోడల్‌ అధికారి సత్యనారాయణరావు, సిబ్బంది పాల్గొన్నారు.

బాసర ఆర్జీయూకేటీలో..

బాసర: బాసర ఆర్జీయూకేటీలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎ డ్యుకేషన్‌ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. కా ర్యక్రమాన్ని ఫ్యాకల్టీ ఇన్‌చార్జి ఎం.రామకృష్ణ, ఫిజి కల్‌ డైరెక్టర్‌ శ్యాంబాబు సమర్థవంతంగా పర్యవేక్షించారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైకాలజీ కౌన్సిలర్‌ నాగలక్ష్మి ఆసనాలు, వాటి ప్రయోజనాలను వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement