గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

● లేచిపోయిన ఇంటి పైకప్పు రేకులు ● ధర్మోరలో పిడుగుపడి ఆవు మృతి

ముధోల్‌: మండలంలోని విఠోలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామానికి చెందిన దండి చిన్నక్క ఇంటి రేకులు లేచిపోయాయి. ఇంట్లోని చిరుధాన్యాలు, బట్టలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటోంది. వానాకాలం ప్రారంభమైన పక్షం రోజుల్లో భారీ వర్షం కురవడంతో రైతులు సోమవారం నుంచి సాగు పనుల్లో నిమగ్నం కానున్నారు.

పిడుగు పాటుకు ఆవు మృతి

లోకేశ్వరం: మండలంలోని ధర్మోర గ్రామానికి చెందిన సర్పంచ్‌ సంజీవరెడ్డికి చెందిన ఆవు ఆదివారం సాయంత్రం పిడుగు పాటుకు గురై మరణించినట్లు లోకేశ్వరం పశువైద్య సహాయకుడు శేఖర్‌ తెలిపారు. పంచగుడి గ్రామ శివారు ప్రాంతంలోని గోదావరి న ది ఒడ్డున ఆవులను మేతకు తోలుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటి వచ్చే క్రమంలో పిడుగు పాటు గురై సంజీవరెడ్డి ఆవు మరణించింది. ఆవు విలువ రూ.50వేలు ఉంటుందని యజమాని తెలిపాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement