నిర్మల్‌టౌన్: వాహన యజమానులు, డ్రైవర్లు మో టార్ వాహనాల చట్టంలోని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎంవీఐలు తిరుపతి, దూప్‌సింగ్ సూచించారు. శనివారం రాత్రి గంజాల్ టోల్ ప్లాజా వద్ద, ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న ఓవర్ లోడ్, గూడ్స్ లారీ, ట్రావెల్ బస్సులను పట్టుకున్నారు. 11 బస్సులు, రెండు గూడ్స్ లారీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధిక లోడ్‌తో వాహనాలు వెళ్తుండడంతో రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశముందని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని వెల్లడించారు. ఏఎంవీఐలు అక్షయ్, రజనీకాంత్, సిబ్బంది తేజరావు, వికాస్, లిఖిత్ తదితరులున్నారు.


