కుభీర్: మండల కేంద్రానికి చెందిన జాదవ్ మాధవ్ అనే యువకుడు 41రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని జగ్‌దాల్‌లో ఉన్న ట్లు ‘సాక్షి’తో తెలిపారు. ఆయన తన పాదయాత్ర ను మే 11న కుభీర్‌లోని విఠలేశ్వర మందిరం నుంచి ప్రారంభించారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగా ల సందర్శనకు పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తె లిపారు. ఇప్పటివరకు 550కిలోమీటర్లు పాదయా త్ర చేసినట్లు పేర్కొన్నారు. ఈయన గతంలో కుభీర్ నుంచి అయోధ్యకు, కుభీర్ నుంచి మహారాష్ట్రలోని తుల్జాభవానికి, కుభీర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేశారు. పాదయాత్ర ప్రారంభించినప్పుడు, పూర్తిచేస్తున్నప్పుడు గ్రామస్తులు, హిందు సంఘాలవారు ఆయన మద్దతు తెలిపి సన్మానించారు.


