టీశాట్‌లో మస్కాపూర్‌ విద్యార్థుల కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

టీశాట్‌లో మస్కాపూర్‌ విద్యార్థుల కార్యక్రమం

Jun 21 2026 12:19 AM | Updated on Jun 21 2026 12:19 AM

ఖానాపూర్‌: విద్యారంగంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న పీఎంశ్రీ మస్కాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌కు మరో అరుదైన అవకాశం దక్కింది. ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో ఈ ఏడాది పాఠశాలకు చెందిన 26 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్రంలోనే పాఠశాల ప్రథమస్థానం సాధించింది. దీంతో హైదరాబాద్‌లో నిర్వహించిన టీసాట్‌ లైవ్‌ కార్యక్రమానికి ఆహ్వానించారు. హెచ్‌ఎం జాడి శ్రీనివాస్‌ మాట్లాడుతూ 2018 నుంచి 2026 వరకు మొత్తం 145 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికయ్యారని తెలిపారు. టీశాట్‌ లైవ్‌ కార్యక్రమంలో ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష ప్రాముఖ్యతను వివరిస్తూ వివరించారు. విద్యార్థులు మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, గణితం, సైన్స్‌, సామాజిక శాస్త్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికబద్ధంగా సిద్ధమైతే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోనగిరి నరేందర్‌, కుర్ర శేఖర్‌, వెన్నం అంజయ్య, షేక్‌ ఇమ్రాన్‌, రాపర్తి కిషన్‌ ప్రసాద్‌, సయ్యద్‌ ఫరాజ్‌, బడోల్ల రవి, జోగ్‌ధండ్‌ లక్ష్మణ్‌రావు, చట్ల విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement