లోకేశ్వరం: ప్రతీ రైతు తనకున్న వ్యవసాయ భూమి లో కుటుంబానికి సరిపడా కూరగాయలు సాగు చేయాలని భైంసా డివిజన్ హార్టికల్చర్ అధికారి జావిద్ పాషా అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులకు ఐదు రకాల కూరగాయల విత్తనాల కిట్‌లను శుక్రవారం అందజేశారు. ఈసందర్భంగా జావిద్ పాషా మా ట్లాడుతూ రైతులు కూరగాయలు, పంట్ల తోటలు సాగు చేయాలన్నారు. రూ.500 విలువ చేసే టమాటా, మిర్చి, బెండ, పాలకూర, తోట కూరల విత్తనాలు 50 మంది రైతులకు ఉచితంగా అందజేశామన్నారు. ఏవో గిరిరాజ్, ఆత్మ చైర్మన్ గన్ను నర్సారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రత్నకర్‌రావు, సర్పంచ్ దర్వా డి.కపిల్, మాజీ ఎంపీపీ లింగన్న, ఉద్యానశాఖ విస్తీర్ణ అధికారి మోహిన్, నాయకులు సుదర్శ న్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, భీంరావ్‌పటేల్, ఏఈ వోలు మౌనిక, సంగీత, రచన పాల్గొన్నారు.


