గ్రామం సుభిక్షంగా ఉండాలని.. | - | Sakshi
Sakshi News home page

గ్రామం సుభిక్షంగా ఉండాలని..

Jun 20 2026 12:01 AM | Updated on Jun 20 2026 12:01 AM

బాసర: గ్రామం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని బాసర గ్రామ పెద్దలు శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో సంప్రదాయబద్ధంగా దేవతలను ఆహ్వానించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. తీర్థప్రసాదాలు అందజేసి గ్రామస్తులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు నూకం లింగారావు మనోహర్‌రావు, గౌరవల్ల రాజులు, కొక్కుల గంగాధర్‌, దావు రాములు దేవేందర్‌, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement