భూధార్‌ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

భూధార్‌ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

Jun 20 2026 12:01 AM | Updated on Jun 20 2026 12:01 AM

● రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ లోకేశ్‌కుమార్‌

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి

నిర్మల్‌టౌన్‌: భూధార్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించి, భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ లోకేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల్లో భూధార్‌ సర్వే చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సర్వేయర్లను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. అలాగే భూభారతి దరఖాస్తులను 60 రోజుల గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. భూధార్‌ సర్వే నిర్వహణకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని, సాదాబైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, ఏడీ ల్యాండ్‌ సర్వేయర్‌ నరసింహమూర్తి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలి

నిర్మల్‌టౌన్‌: వర్షాకాలం ఆకస్మిక వరదలు సంభవిస్తే ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. భారీ వర్షాలు కురిసి, వరదలు సంభవించి ప్రజలకు ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే వారికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సహాయం చేస్తుందన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందానికి అవసరమైన వసతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, డీఆర్వో రమేశ్‌రాథోడ్‌, ఆర్డీవో దేవీదాస్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ముఖేశ్‌కుమార్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ పకడ్బందీగా చేపట్టాలి

నిర్మల్‌టౌన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్‌న్స్‌ నిర్వహించా రు. అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారంల పంపిణీ, తిరిగి స్వీకరణ, తదితర అంశాలను పకడ్బందీగా చేపట్టా లన్నారు. బూత్‌ లెవెల్‌ అధికారులకు తప్పనిసరి గా అన్ని అంశాల పై అవగాహన ముఖ్యమన్నా రు. జిల్లాల వారీగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిర్వహణకు చేపట్టిన చర్యలు, రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమావేశాల వివరాలు కలెక్టర్ల ద్వారా తెలుసుకున్నారు. ప్రక్రియను మొత్తం కలెక్టర్లు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించా లని తెలిపారు. కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా మాట్లాడు తూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ప్రక్రియకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌ కుమార్‌, డీఆర్‌వో రాథోడ్‌ రమేశ్‌, ఆర్డీవో దేవీదాస్‌, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వాతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement