పోలీసులకు సాంకేతిక బలం | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు సాంకేతిక బలం

Jun 20 2026 12:01 AM | Updated on Jun 20 2026 12:01 AM

● పోలీస్‌ స్టేషన్లకు నూతన పరికరాలు ● కేసుల విచారణ వేగవంతం, నేరాల గుర్తింపు సులభం

నిర్మల్‌టౌన్‌: జిల్లా పోలీస్‌ శాఖను సాంకేతికంగా మరింత బలోపేతం చేయడం, ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు నూతన సాంకేతిక పరికరాలను అందజేశారు. ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్లలో కేసుల సంఖ్య పెరగడం, కంప్యూటర్లు, ట్యాబ్‌లలో వస్తున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ఈ పరికరాలు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా కోర్టు కేసుల వివరాలను వేగంగా నమోదు చేయడం, కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు సమన్వయ అధికారులు, ప్రాసిక్యూషన్‌ అధికారులకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందించడం ద్వారా న్యాయ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ పరికరాలు సహకరిస్తాయి.

ఎస్పీ చేతులమీదుగా పంపిణీ

జిల్లాలోని పోలీస్‌ స్టేషన్లకు బార్‌కోడ్‌ స్కానర్లు, లే బుల్‌ ప్రింటర్లు, సింగిల్‌ డిజిట్‌ స్కానర్లు, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో సిస్టమ్స్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్లు, ప్రింటర్లను జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్‌ కా ర్యాలయంలో ఎస్పీ జానకీషర్మిల శుక్రవారం పంపి ణీ చేశారు. పోలీస్‌ శాఖను సాంకేతికంగా బలోపే తం చేసి, ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పరికరాలను అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఏవో యూనస్‌ అలీ, ఇన్‌స్పెక్టర్లు కృష్ణ, గోవర్ధన్‌రెడ్డి, స మ్మయ్య, ఆర్‌ఐ(అడ్మిన్‌) రామ్‌నిరంజన్‌రావు, ఎ స్సైలు జి.లింబాద్రి, శ్రీకాంత్‌, రవీందర్‌, గణేశ్‌, గోపి, శ్రావణి, హన్మాండ్లు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.

ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్లు

వ్యక్తుల గుర్తింపును ధ్రువీకరించడం, నేర చరిత్రను గుర్తించడం, అనుమానితుల వివరాలను తక్షణమే సేకరించడం, పెండింగ్‌ కేసుల ఛేదనలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

సింగిల్‌ డిజిట్‌ స్కానర్లు

ఇవి వ్యక్తుల గుర్తింపును క్షణాల్లో ధ్రువీకరించడంతోపాటు, కేంద్రీకృత డేటాబేస్‌లతో సరిపోల్చి నేర చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.

బార్‌కోడ్‌ స్కానర్లు..

ముద్రించిన బార్‌కోడ్‌లను డిజిటల్‌ సమాచారంగా మార్చి రికార్డుల నిర్వహణ, సాక్ష్యాల ట్రాకింగ్‌ , ఇ తర పరిపాలనా ప్రక్రియలను వేగవంతం చేస్తాయి.

లేబుల్‌ ప్రింటర్లు

కేసు ఫైళ్లు, సాక్ష్యాధారాలు, ఇతర రికార్డులను కచ్చితంగా గుర్తించి నిర్వహించడంలో కీలకంగా ఉపయోగపడతాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement