రాజీతో కేసుల నుంచి విముక్తి | - | Sakshi
Sakshi News home page

రాజీతో కేసుల నుంచి విముక్తి

Jun 20 2026 12:01 AM | Updated on Jun 20 2026 12:01 AM

● నేడు జాతీయ లోక్‌ అదాలత్‌ ● కక్షిదారులకు సదావకాశం ● వాహన ప్రమాదాలకు సంబంధించిన వివాదాలు ● చీటింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు ● శారీరక గొడవలకు సంబంధించిన సమస్యలు ● దాంపత్య వివాదాలు, విడాకుల కేసులు ● స్వల్ప స్థాయి దొంగతనాలు ● కరోనా లాక్‌డౌన్‌ సమయంలో దాఖలు చేసిన కేసులు ● డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ● ఇతర రాజీపడదగిన కేసులు

నిర్మల్‌టౌన్‌: తెలిసో తెలియకో చేసిన తప్పులకు కేసుల్లో ఇరుక్కుని.. ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అలాంటి వారికి సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్‌ అదాలత్‌ ఉత్తమ వేదికగా నిలుస్తోంది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులతోపాటు, వ్యాజ్యం ముందు దశలో ఉన్న సమస్యలను కూడా ఒక్క రోజులోనే పరిష్కరించుకునే అవకాశం ఈ వేదిక కల్పిస్తుంది.

కోర్టుల్లో నిర్వహణ..

జిల్లాలోని నిర్మల్‌, బైంసా, ఖానాపూర్‌ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని తమ కేసులను రాజీ ద్వారా ముగించుకోవచ్చు.

రాజీకి అనువైన కేసులు

లోక్‌ అదాలత్‌లో వివిధ రకాల కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు.

హాజరు కావడం ఎలా?

లోక్‌ అదాలత్‌లో కేసు పరిష్కరించుకోవాలంటే ఫిర్యాదుదారు, నిందితుడు ఇద్దరూ సంబంధిత కోర్టులో హాజరు కావాలి. గుర్తింపు కోసం ఆధార్‌ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. కోర్టులో హాజరైన వెంటనే రాజీ ప్రక్రియ పూర్తి చేసి, ఒకే రోజులో కేసును ముగించుకోవచ్చు. సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చిక్కుల నుంచి విముక్తి లభిస్తుంది. సాధారణ కోర్టు విచారణ అవసరం లేకుండా సులభంగా పరి ష్కారం సాధ్యమవుతుంది. న్యాయవాది ఫీజు లు, కోర్టు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. తక్కువ ఖర్చుతో శాంతియుతంగా వివాదా లను ముగించుకునే అవకాశం ఉంటుంది.

కేసుల నుంచి విముక్తి..

కేసుల పరిష్కారానికి జాతీయ లోక్‌ అలదాత్‌ మంచి అవకాశం. వివాదాలు ఒక్కసారి ప్రారంభమైతే... జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయి. వాటిని త్వరగా పరిష్కరించుకోవాలి. రాజీపడదగిన కేసులను లోక్‌అదాలత్‌ లో పరిష్కరించుకోవా లి, కక్షిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. –జానకీషర్మిల, ఎస్పీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement