పంచాయతీ తీర్మానం లేకుండానే రూ.25 లక్షలు అడ్డుకున్న గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి, కలెక్టర్‌కు ఫిర్యాదు
సారంగపూర్: చించోలి(బి) గ్రామంలోని ఎక్స్‌రోడ్డు సమీపంలో ఉన్న ఆర్టీవో కార్యాలయం ప్రధాన రహదారి నుంచి సుమారు 400 మీటర్ల దూరంలో ఉంది. ఈ కార్యాలయానికి రహదారి సౌకర్యం క ల్పించేందుకు ఇటీవల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల నుంచి రూ.25 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చేశా రు. అయితే ఆ రోడ్డు పనులను ఆర్టీవో కార్యాల యం వైపు చేయకుండా సమీపంలోని ఒక ప్రైవేటు వెంచర్‌వైపు మళ్లించి నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికే సుమారు 15 మీటర్ల రహదారి పనులు పూర్తి చేశారు. ఈ అక్రమ మళ్లింపు విషయం తెలు సుకున్న గ్రామస్తులు వెంటనే గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకుని పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
రాజకీయ అండదండలతోనే..
ప్రైవేటు వెంచర్ ఒక రాజకీయ నాయకుడికి చెందిన ది కావడంతో, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో వేయాల్సిన రోడ్డును తమ వెంచర్‌లోకి మళ్లించేందుకు అధికారులపై రాజకీయ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే రోడ్డు మంజూరు రావడం వల్ల గ్రామస్తులు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం విడుద ల చేసే నిధులను ఇలా పక్కదారి పట్టించడం సరి కాదని, దీనికి కారకులైన వారందరిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ఆర్టీవో కార్యాలయానికి మళ్లించాం
వాస్తవానికి సీసీరోడ్డు ఆర్టీవో కార్యాలయానికి మంజూరైంది. అయితే సదరు సీసీరోడ్డును ఆర్టీవో కార్యాలయం దారిలో వేయడానికి బదులు దానికి పక్కనే గల దారిలో వేశారని నా దృష్టికి వచ్చింది. వెంటనే పనులు నిలిపివేసి సదరు రోడ్డును ఆర్టీవో కార్యాలయానికి వెళ్లే దారిలో నిర్మించాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. మెటీరియల్ మొత్తం ఆర్టీవో కార్యాలయం రహదారి వద్దకు మార్చి పనులు చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– దేవీదాస్, పీఆర్ ఏఈ, సారంగాపూర్


