లోకేశ్వరం: రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి బీవీ రమణ సూ చించారు. గురువారం మండలంలోని పంచగుడి, వట్టోలి గ్రామాల్లో రైతులు సాగు చేసిన ఆయిల్ పామ్ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్‌కు ఎలాంటి తెగుళ్లు సోకినా వెంటనే ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని తెలిపారు. పంట రాగానే జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్‌లో విక్రయించాలని సూచించారు. ఉద్యానశాఖ భైంసా డివిజన్ అధికారి జావిద్ పాషా, ఆయిల్ పామ్ మేనేజర్ ఆశాష్, విస్తరణ అధికారి మోహిన్, క్లస్టర్ అధికారి సంతోష్ ఉన్నారు.


