మొక్కకు చుక్క చేరేదెలా? | - | Sakshi
Sakshi News home page

మొక్కకు చుక్క చేరేదెలా?

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

జిల్లాలో వర్షాభావ పరిస్థితులు సూక్ష్మ సేద్యం విధానమే మేలు పరికరాలపై రాయితీ తగ్గింపు రైతులకు తప్పని ఆర్థికభారం

లక్ష్మణచాంద: ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచి స్తుండగా రైతులు ఆందోళనకు గురవుతున్నా రు. పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు లాంటి ఆరుతడి పంటలు సాగు చే యాలని అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటివరకు భారీ వర్షాలు కురియలేదు. జూన్‌ సగం పూర్తైనా సరైన వ ర్షాలు లేక అన్నదాతలు పంటలు ఎలా సాగు చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నా రు. వరుణడి కరుణ కోసం నిత్యం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో త క్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సా గు చేయడానికి సూక్ష్మ సేద్యమే అనువైన పద్ధతి అని అధికారులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో ప్రతీ నీటిబొట్టు మొక్కకు నేరుగా అందుతుంది. కాగా, బోరు బావులున్న రైతులు పసుపు, పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేశారు. వర్షాలు లేక డ్రిప్‌, రెయిన్‌ డ్రిప్‌ తదితర విధానాల్లో పంటలకు నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నారు.

రాయితీ తగ్గించిన సర్కారు

ఈ ఏడాది రైతులకు ఇచ్చే సబ్సిడీని సర్కారు తగ్గించింది. గతేడాది వరకు ఎస్సీ, ఎస్టీలకు నూక్ష్మ సే ద్యం పరికరాలను 100శాతం రాయితీతో అందించింది. ప్రస్తుతం 10శాతం రాయితీని తగ్గించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ రైతులకు 90శాతం రాయితీ, బీసీలకు గతంతో 90 శాతం రాయితీ ఇవ్వగా ఈసా రి 80శాతం, జనరల్‌ రైతులకు గతంలో 80శాతం రాయితీ ఇవ్వగా ఈసారి 70శాతమే ఇస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులపై భారం పడనుంది.

ఆయిల్‌ పామ్‌ వైపు మొగ్గు

ప్రస్తుతం సూక్ష్మ సేద్యం పరికాల కోసం వస్తున్న దరఖాస్తుల్లో రైతులు ఆయిల్‌ పా మ్‌ సాగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ట్లు తెలుస్తోంది. అయితే, పండ్ల తోటలు, కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నీటి ఎద్దడి సమయంలో కూరగాయలు, పండ్ల తోటల సాగుకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో సూక్ష్మ సేద్యం పరికరాలను మంజూరు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు డ్రిప్‌ పద్ధతిలో 23,498 ఎకరాలు, స్ప్రింక్లర్స్‌ విధానంలో 4,463 ఎకరాలు, సూక్ష్మ సేద్యం విధానంలో 27,961 ఎకరాలు సాగవుతున్నట్లు జిల్లా హార్టికల్చర్‌ అధికారులు తెలి పారు. అలాగే, 2026 సంవత్సరానికి డ్రి ప్‌ ఇరిగేషన్‌ లక్ష్యం 302 ఎకరాలు, స్ప్రింక్ల ర్స్‌ ద్వారా 452, ఆయిల్‌ పామ్‌ సాగు డ్రిప్‌ ద్వారా 2,632 ఎకరాలు ఉందని ఉద్యానవన అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement