నిర్మల్: వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నిశాఖలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. బాసర వద్ద పాత పుష్కర ఘాట్లకు అ వసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు కొత్త ఘాట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్యాణకట్ట, పిండప్రదాన వేదికలు, దుస్తులు మార్చుకునే గదులను తక్షణమే నిర్మించా లని సూచించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఘాట్ల సమీపంలో తాగునీటి సౌకర్యాన్ని సమృద్ధిగా కల్పించాలని దిశానిర్దే శం చేశారు. ఆయా శాఖల అధికారులు తమకు కే టాయించిన పనులకు సంబంధించిన సమగ్ర ప్రతి పాదనలను వెంటనే సిద్ధం చేయాలని సూచించా రు. ఈ సందర్భంగా బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ పై కూడా చర్చించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, బాసర ఆలయ ఈవో అంజనాదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వొద్దు
ప్రభుత్వ వసతిగృహాల విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని రాంనగర్‌లో బాలికల ఆశ్రమాన్ని గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి తెలుసుకున్నారు. మెనూ ప్రకా రం నాణ్యమైన భోజనం అందించాలని సూచించా రు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఆయా సబ్జెక్టుల్లో వారి సామర్థ్యాలను పరీక్షించారు. డీఈవో భోజన్న, అధికారులున్నారు.


