బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను గురువారం ఆర్కిటెక్చర్ అధికారులు మోతీలాల్, మాధవి పరిశీ లించారు. జూలై 5న నిర్వహించనున్న బాలాల యం ఏర్పాట్ల దృష్ట్యా రూ.150 అక్షరాభ్యాస మండపాన్ని సందర్శించి అవసరమైన సూచనలు చేశారు. ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్న రూ.150 అక్షరాభ్యాస మండపంలోనే బాలాలయం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ.వెయ్యి ప్రత్యేక అక్షరాభ్యాస కార్యక్రమాలూ ఇదే ప్రాంగణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.150 అక్షరాభ్యాస కార్యక్రమాలు ధ్యాన మందిరం లేదా పాత ఈవో కార్యాలయంలో కొనసాగనున్నాయని పేర్కొన్నారు. అమ్మవారి ఆలయాన్ని ఆధునిక సౌకర్యాలు, సంప్రదాయ శిల్పకళా వై భవం ప్రతిబింబించేలా తీర్చిదిద్దేందుకు అన్ని వి ధాలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో అంజనాదేవి, నిర్మల్ ఏఈ శ్యామ్, ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి తదితరులున్నారు.
ఆధ్యాత్మిక వాతావరణం విస్తరించేలా..
శృంగేరి పీఠాధిపతి శిష్యుల ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు బాలాలయం ఏర్పాటుకు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తీసుకురానున్నాయి. మరోవైపు ఆల య నిర్మాణ పనులు చేపట్టిన డోనర్ 2027 జూన్ 1 నాటికి ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో కార్యాచరణ ప్రారంభించినట్లు సమాచారం. ఆ లయ నిర్మాణంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆధ్యాత్మిక వాతావరణం మరింత విస్తరించేలా పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే బాసర క్షేత్రం దేశవ్యాప్తంగా మరింత ఆధ్యాత్మికంగా ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


