నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

● ‘ట్రిపుల్‌ఐటీ’ భోజనంలో బొద్దింక ● గతంలోనూ ఆహారం వికటించి 300మంది విద్యార్థులకు అస్వస్థత ● నర్సాపూర్‌ కేజీబీవీలో 63మందికి.. ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ గురువారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

విద్యుత్‌తో జర భద్రం

విద్యుత్‌ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా విద్యుదాఘాతంతో ప్రాణాలు పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

ఫిర్యాదుల సత్వర

పరిష్కారానికే ప్రజావాణి

భైంసాటౌన్‌: ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. పట్టణంతోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజావాణి నిర్వహించారు. సబ్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 11 ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత ఎస్‌హెచ్‌వోలను ఆదేశించారు. అలాగే, భరోసా కేంద్రంలో కొన్ని కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరువర్గాలకు కౌన్సిలింగ్‌ ఇవ్వడాన్ని ఎస్పీ పరిశీలించారు. అనంతరం పెండింగ్‌ ఫిర్యాదులపై సమీక్షించారు. ఏఎస్పీ సాయికిరణ్‌ ఉన్నారు.

నిర్మల్‌/భైంసా: తమ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు మంచి భోజన వసతులూ ఉంటాయన్న ఉద్దేశంతోనే చాలామంది తల్లిదండ్రులు ట్రిపుల్‌ఐటీ, కే జీబీవీలు, గురుకులాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూ పుతున్నారు. వాటిలో చదువు, వసతి బాగానే ఉంటున్నా.. చాలా సందర్భాల్లో భోజనం విషయంలో నే ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో నాణ్యతలేని సరుకులు, పాడైన కూరగాయలు, కుళ్లిన గుడ్లను ఉపయోగించడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాత ఘటనలు మరిచిపోకముందే తాజాగా బాసర ట్రిపుల్‌ఐటీ మెస్‌ల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు తినే ఆహారంలో బొద్దింక రావడం విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులనూ కలవరపరుస్తోంది.

నాణ్యత లోపంతో..

బాసర ట్రిపుల్‌ఐటీ మెస్‌లతో పాటు కేజీబీవీలు, గురుకులాలు, సంక్షేమశాఖల వసతిగృహాల్లో చాలా వరకు నాణ్యతలేని సరుకులు, నాసిరకమైన నూనెలు, తక్కువధరకు తీసుకువచ్చిన కూరగాయలు, కాలం చెల్లిన వస్తువులను వాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం ట్రిపుల్‌ఐటీలో జరిగిన ఫుడ్‌పాయిజన్‌ ఘటన తర్వాత మెస్‌ లను పరిశీలిస్తే కుళ్లిన కోడిగుడ్లు, కాలం చెల్లిన గో ధుమ, శనగపిండి, ఉప్మారవ్వ, నాసిరకమైన నూనెలు వాడుతున్నట్లు తేలింది. అలాగే, చాలారోజుల పాటు స్టోరేజీ చేసిన వస్తువుల్లో పురుగులు, బూజుపట్టినా వాటిని అలాగే వంటల్లో వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా బుధవారం కుంటాలలోని ఆదర్శపాఠశాలను కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా తనిఖీ చేయగా, సరుకులను భద్రపర్చే స్టోర్‌రూమ్‌ అపరిశుభ్రంగా ఉండటంతో ఆయన మండిపడ్డారు.

ఆందోళన చేసినా మార్చలేదు

బాసర ట్రిపుల్‌ఐటీలో 2022లో జరిగిన ఫుడ్‌పాయిజన్‌ ఘటన, అంతకు కాస్తముందు కూరల్లో కప్పలు, అన్నంలో పురుగులు రావడంతో సదరు మెస్‌ నిర్వాహకులను మార్చాలంటూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. అప్పట్లో ఉన్న ప్రభుత్వం వారిని మారుస్తామంటూ ప్రకటించింది. ఇస్కాన్‌ వాళ్లకు లేదంటే ఐకేపీ మహిళలకు ఇవ్వాలన్న చర్చలు చేసింది. కానీ, రాజకీయ ప్రభావంతో కొన్నిరోజులకు మళ్లీ పాతవారినే కంటిన్యూ చేసింది. తాజాగా సదరు మెస్‌లోనే ఆలూకూర్మలో బొద్దింక రావడం గమనార్హం.

రెండేళ్లక్రితం ఫుడ్‌పాయిజన్‌తో ఆస్పత్రి పాలైన నర్సాపూర్‌(జీ) కేజీబీవీ విద్యార్థినులు

ఎస్‌ఐఆర్‌ కోసం హెల్ప్‌డెస్క్‌

భైంసాటౌన్‌: ఓటరు ప్రత్యేక జాబితా సవరణ ప్రక్రియపై సందేహాల నివృత్తికి పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పా టు చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ప్రజల్లో నెలకొన్న అనుమానాల నివృత్తితోపాటు అవసరమైన సహాయం అందించేందుకు దీనిని ఏర్పా టు చేసినట్లు సబ్‌ కలెక్టర్‌ అజ్మీర సంకేత్‌కుమా ర్‌ తెలిపారు. కార్యాలయ పని వేళల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ–కేవైసీ పూర్తి చేయాలి

నిర్మల్‌టౌన్‌: ఈ నెల 30లోపు ఈ–కేవైసీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అధికా రులు, ఎల్‌పీజీ డీలర్లతో సమావేశమై మాట్లాడారు. ఈ–కేవైసీ పూర్తి చేయని వినియోగదారులను గుర్తించి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వినియోగదారులకు తెలు పాలని పేర్కొన్నారు. గడువు ప్రక్రియ పూర్తి చేయని ఎల్‌పీజీ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

భోజనం, వసతితో కూడిన విద్యాలయాలు, వసతిగృహాలను ఉన్నత, సంబంధిత అధికారులు తరచూ పర్యవేక్షించాలి. కానీ.. జిల్లాలో ఇలాంటి పర్యవేక్షణ కొరవడడం ఫుడ్‌పాయిజన్‌ లాంటి ఘటనలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన సీరియస్‌ ఘటనలు, ఆందోళనలను ట్రిపుల్‌ఐటీ అధికారులు విస్మరిస్తుండటంతోనే మళ్లీ భోజనంలో బొద్దింకలు వచ్చే పరిస్థితి ఏర్పడినట్లు ఆరోపణలున్నాయి. అలాగే, జిల్లాలోని కస్తూరిబా పాఠశాలలు, గురుకులాలు, ఆదర్శపాఠశాల, వసతిగృహాలనూ తరచూ పర్యవేక్షించాల్సి న అవసరముంది. ఇక విద్యార్థులకు పెట్టే ముందు భోజనాన్ని సంబంధిత సిబ్బంది తిని, పరిశీలించాలి. కానీ.. చాలాచోట్ల ఇలా చేయడం లేదు. వీటితో పాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కూడా తరచూ పర్యవేక్షించాల్సిన అవసరముందన్న వాదన పెరుగుతోంది.

నర్సాపూర్‌(జీ) కేజీబీవీలో 63 మందికి..

నర్సాపూర్‌(జీ) మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో 2024 ఏప్రిల్‌లో రాత్రిపూట ఫుడ్‌పాయిజన్‌ అయ్యింది. ఈ ఘటనలో దాదాపు 63మంది వరకు విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది, స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రులకు తరలించారు. నిర్మల్‌ ఆస్పత్రిలో 39, నర్సాపూర్‌లో 23 మందికి చికిత్స అందించారు. ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వారిని నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.

కొరవడిన పర్యవేక్షణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement