నిర్మల్: నిర్మల్ బస్టాండ్ ఏరియా దారుణంగా ఉంది. పాతబస్టాండ్ రోడ్డు నుంచి ప్రధాన రహదారికి వచ్చే సందు మొదలు అంబేడ్కర్‌చౌక్ దాకా రోడ్డు కు ఇరువైపులా గందరగోళంగా ఉంటుంది. రెండువైపులా దుకాణాలు, పండ్ల బండ్లు ఫుట్‌పాత్ దాటి రోడ్లపైకి వచ్చాయి. బస్టాండ్ గేట్లను ఆనుకునే దు కాణాలు పెట్టడమనేది రాష్ట్రంలో ఎక్కడా లేదు. వి క్రయదారులతోపాటు కొనుగోలుదారుల వాహనా లూ ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డు పై వెళ్లే వాహనాలకు, బస్టాండ్‌లో నుంచి వచ్చే బ స్సులకు చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. బస్టాండ్ ఇన్, అవుట్ గేట్ల వద్ద యూటర్న్ తీసుకోవడం కష్టంగా ఉందని ఆర్టీసీ డ్రైవర్లు వాపోతున్నారు.
గందరగోళంగా వివేక్‌చౌక్
బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి బయటపడ్డామనుకునేంత లోపే వివేక్‌చౌక్–పాతబస్టాండ్ ప్రాంతం అంతకుమించి గందరగోళంగా ఉంటోంది. ప్రధాన రహదారిపైగల ఈ వై జంక్షన్‌లో బ స్టాండ్, శివాజీచౌక్, పాతబస్టాండ్, మయూరి హోట ల్ సందు.. ఇవన్నీ ఒకేచోట కలుస్తాయి. ఇక్కడ సి గ్నల్‌వ్యవస్థ కూడా లేదు. ఏ దిక్కు నుంచి ఏ వాహనమొస్తుందో, ఎటువైపు నుంచి ఎవరు ఢీకొడతారో నన్న ఆందోళన కలిగిస్తోంది. ఇవి చాలవన్నట్లు ఇ క్కడ పండ్ల బండ్లు, కూరగాయలు ప్రధాన రహదా రిపైనే విక్రయిస్తున్నారు. మయూరి హోటల్ పా ర్కింగ్ వాహనాలు, పాతబస్టాండ్ షాపింగ్ కోసం వచ్చినవారి వెహికిల్స్ రాకపోకలకు అటంకంగా మారుతున్నాయి. ఇక్కడ ఎన్టీఆర్ మినీస్టేడియం వైపు నుంచి యూటర్న్ తీసుకునే చోటే రోడ్డుపై పండ్ల దుకాణాలు పెట్టారు. స్కూల్ బస్సులు, కార్లు యూటర్న్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతోంది.
వెండింగ్‌జోన్ ఏర్పాటెప్పుడో!
జిల్లాకేంద్రంలో ఇష్టానుసారం తోపుడుబండ్లు, దు కాణాలు ఏర్పాటు చేయడంతోనే ట్రాఫిక్ కష్టాలు ఏ ర్పడుతున్నట్లు గతంలోనూ పాలకులు, అధికారులు గుర్తించారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులు, తోపుడుబండ్ల కోసం ప్రత్యేకంగా వెండింగ్‌జోన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించా రు. కానీ, ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. కూరగాయల మార్కెట్ వద్దా ప్రతీ ఉదయం వాహనాల రాకపోకలకు ఇబ్బందవుతోంది. కూరగాయ ల మార్కెట్‌తో పాటు పండ్ల మార్కెట్‌నూ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. వీటితోపాటు రోడ్లపై ఆక్రమణలను తొలగిస్తేనే ట్రా‘ఫికర్’ తీరుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.
‘ఒకదిక్కు ఆటోలు రోడ్డుమీదనే.. ఇటు సగం పండ్ల దుకాణాలూ అట్లనే.. మిగతా సగం దారిలో పోదామంటే ఎదురుగా రాంగ్‌రూట్లో వస్తున్నారు.. వాళ్లను తప్పించుకుని యూటర్న్ తీసుకుందామంటే ఆవైపు దుకాణాలూ.. సగం రోడ్డుపైనే.. ఆ లొల్లిల బండి మలుపుదామంటే సుక్కలు కనిపించినయ్.. ఇదేం నిర్మల్‌రా బాబు..! పేరుకు ఊరుకు సంబంధమే లేదు’ అంటూ అడెల్లిలో పండుగ ఉందంటే నిర్మల్‌కు వచ్చిన నిజామాబాద్‌వాసి సందీప్ చిరాకు, చికాకు పడుతూ బంధువులను ప్రశ్నించాడు.
ఇవి నిత్యం నిర్మల్ ప్రజలు పడుతున్న పాట్లు. పేరుకు జిల్లాకేంద్రమైనా కనీసం ట్రాఫిక్ నియంత్రణ, నిబంధనలు పాటించేవారు, పట్టించుకునేవారే లేరు.
అన్ని చౌరస్తాలూ అంతే..
అంబేడ్కర్ చౌరస్తా, జయశంకర్‌సార్ సర్కి ల్, ఆర్డీవో ఆఫీస్, రాంజీగోండు జంక్షన్, శివాజీచౌక్, ఈద్‌గాంచౌరస్తా.. ఈ ఏరియాలన్నీ వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఈ చౌరస్తాలు విశాలంగా లేకపోవడం, దుకాణాలు రోడ్లపైనే ఉండటం ట్రాఫిక్ సమస్యకు కారణంగా చెప్పవచ్చు. శివాజీచౌక్, జయశంకర్‌సార్ సర్కిల్, ఈద్‌గాంలో సిగ్నల్ వ్యవస్థ ఉన్నప్పటికీ చాలామంది పాటించడం లేదు. రెడ్ సిగ్నల్ పడ్డా.. అలాగే వెళ్లిపోతున్నారు. ఇక ఈ చౌరస్తాల్లో ఎడమవైపు వెళ్లాల్సిన వారి కోసం ‘ఫ్రీ లెఫ్ట్’ ఏర్పాట్లూ లేవు.


