విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

కుంటాల: విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా హెచ్చరించారు. బుధవారం కుంటాల ఆదర్శ పాఠశాలను సందర్శించారు. 50 మంది విద్యార్థులే హాజరు కావడంతో ప్రిన్సిపాల్‌ రాజును ప్రశ్నించారు. తరగతులవారీగా ఉపాధ్యాయులను పిలిపించి పాఠశాలలు ప్రారంభమై మూ డురోజులైనా హాజరు శాతం తక్కువగా ఉండడంతో అసహనం వ్యక్తంజేశారు. తల్లిదండ్రులతో మా ట్లాడి హాజరు శాతం పెంచాలని సూచించారు. మ ధ్యాహ్న భోజన సరుకుల నిల్వ గది అపరిశుభ్రంగా ఉండడంతో ప్రిన్సిపాల్‌కు షోకాజ్‌ నోటీస్‌ జారీ చే యాలని డీఈవో భోజన్నను ఆదేశించారు. విద్యార్థులకు చదువుతోపాటు సామాజిక అంశాలపై అవగా హన కల్పించాలని, నాణ్యమైన భోజనం అందించా లని సూచించారు. అనంతరం కుంటాల పీహెచ్‌సీ ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. కుంటాలలో జూనియర్‌ కళాశాలకు పక్కా భవనం నిర్మించాలని వెంకటేశ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

ప్రీప్రైమరీ స్కూల్‌లోనే తొలి అభ్యాసం

ప్రీప్రైమరీ పాఠశాలల్లోనే పిల్లలకు తొలి అభ్యాసం అందుతుందని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. మండలంలోని అందకూర్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రీప్రైమరీ పాఠశాలను సర్పంచ్‌ అర్రోజు ప్రవళితో కలిసి ప్రారంభించారు. సామాజిక నైపుణ్యాలు, ఆటపాటలతో కూడిన విద్య, భాషా నైపుణ్యం, సృజనాత్మకత, శారీరక, మానసిక ఎదుగుదలకు ప్రీప్రైమరీ పాఠశాలలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. డీఎంహెచ్‌వో రాజేందర్‌, డీఈవో భోజన్న, తహసీల్దార్‌ కమల్‌సింగ్‌, ఎంపీడీవో వనజ, ఎంఈవో ముత్యం, సర్పంచులు జక్కుల గజేందర్‌, హెచ్‌ఎం సిద్ధిరాం తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement