బాసర: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకే హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. మండల కేంద్రంలో రూ.20 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన ప్రాథమిక ఆరో గ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్ పవన్ చంద్ర, సర్పంచ్ వెంకటేశ్‌గౌడ్, బీజేపీ మండలాధ్యక్షుడు సాయినాథ్ పటేల్, నాయకులు రాజేశ్వర్, సాయిబాబా, సాయిలు తదితరులున్నారు.
తానూరు: మండల కేంద్రంలో రూ.20లక్షలతో చేపట్టిన ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణ పనులు, బెంబర గ్రామంలో రూ.50లక్షలతో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణ పనులను ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావ్ పటేల్, ఎంపీడీవో శ్రీధర్, మాజీ సర్పంచ్ మాధవ్‌రావ్ పటేల్, బీజేపీ మండలాధ్యక్షుడు లక్ష్మ ణ్‌రెడ్డి, నాయకులు చిన్నరెడ్డి, శివాజీ పటేల్, సోమ్‌నాథ్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.


