లక్ష్మణచాంద: పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ ఆదేశించారు. బుధవారం సోన్ మండలంలోని పాక్‌పట్ల గ్రామాన్ని ఆకస్మీకంగా సందర్శించారు. సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించి తడి, పొడి చెత్త వేరు చేస్తున్న తీరును గమనించారు. సేంద్రియ ఎరువు తయారు చేసి రైతులకు విక్రయించి గ్రామపంచా యతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరి శీలించారు. అనంతరం సోన్ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై పారిశుద్ధ్య పనులపై పలు సూచనలు చేశారు. వనమహోత్సవం సందర్భంగా ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి నాటి సంరక్షించేలా అవగాహన క ల్పించాలని సూచించారు. డీపీవో శ్రీనివాస్, ఇన్‌చా ర్జి ఎంపీడీవో జ్యోతి, సోన్ సర్పంచ్ వనజ, పాక్‌పట్ల పంచాయతీ కార్యదర్శి విజయ్ తదితరులున్నారు.


